Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

బంగారానికి మెరుగు పెడుతామని వచ్చి..పుస్తెల తాడుతో ఎస్కేప్

Gang Cheating People With Fake Gold Jewellery, బంగారానికి మెరుగు పెడుతామని వచ్చి..పుస్తెల తాడుతో ఎస్కేప్

క్రైమ్ ఎలా జరుగుతుందో రోజూ చూస్తూనే ఉంటాం..మనవరకూ వచ్చినప్పుడు మాత్రం అందరిలానే మోసపోతాం. రైస్ పుల్లింగ్, ట్రెజర్ హంట్ వాటికి  ఆశపడి చిత్తయిపోతున్న వారు కోకొల్లలు. ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకొక మార్గంలో క్రైమ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తాజాగా బంగారానికి మెరుగుపెడతామంటూ ఇంటికి వచ్చిన దుండగుడు మహిళ పుస్తెల తాడుతో ఎస్కేప్ అయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే…మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని వెంకటగిరి గ్రామంలో మూడు రోజుల క్రితం ఓ ఇద్దరు వ్యక్తులు కలియతిరిగారు. బంగారం, వెండి, ఇత్తడి వస్తువులుకు మెరుగుపెడతామని చెప్పడంతో..అదే గ్రామానికి చెందిన రేణుక అనే మహిళ..కాలి మెట్టెలను మెరుగుపెట్టించింది. అవి జిగేల్‌గా మెరిసిపోతుండటంతో..వెంటనే మెడలో ఉన్న రెండు తులాల పుస్తెల తాడు కూడా ఇచ్చి మెరుగు పెట్టాల్సిందిగా కోరింది. దీంతో అప్పటి వరకు మాములుగా ఉన్న ఎదుటి వ్యక్తి..విక్రమార్కుడు సినిమాలో.. అత్తిలి చిరబరానందస్వామిగా మారిపోయాడు. మెరుగు పెట్టినట్టుగా యాక్ట్ చేసి..తాడుకి పసుపు పూసి..వెంటనే కడిగితేే సరిగ్గా షైన్ ఉండదని..ఒక గంట తర్వాత నీటితో కడగమని చెప్పి వెళ్లిపోయారు. ఆ మహిళ గంట తర్వాత దాన్ని కడగగా గొలుసు నలుపు రంగులోకి మారిపోయింది. టెన్షన్ పడ్డ ఆమె..బంగారం చేయించిన షాపు దగ్గరికి వెళ్లి అడగ్గా..అది బంగారం కాదు..గిల్టుదని తేల్చి చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన సదరు మహిళ లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేసింది. చూశారుగా ఆదమరిచారో జాదుగాళ్ల వలలో పడతారు. బి కేర్‌ఫుల్.