ఆ విషయంలో ఎంత వరకైనా పోరాడతా..: చంద్రబాబు

Chandrababu Visits Flood Hit Areas In Vijayawada, ఆ విషయంలో ఎంత వరకైనా పోరాడతా..: చంద్రబాబు

అమరావతి నుంచి రాజధానిని మార్చాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిపై మంత్రి దారుణంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. అమరావతికి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని చెప్పారు. అన్ని సదుపాయాలు పోగా, 8 వేల ఎకరాలకు పైగా మిగులుతుందని ఆయన అన్నారు. వాటిని అమ్మిన దాంతో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చన్నారు. రాజధాని నిర్మాణాన్ని ఆపి.. దుర్మార్గంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని మార్చాలనే కుట్రతోనే ఇప్పుడు ముంపు ప్రాంతం అంటూ చర్చ లేపుతున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై ఎంత వరకైనా పోరాడుతానని, రాజధాని ముంపునకు గురవుతోందని మంత్రి అనడం దారుణమన్నారు. రాజధానిని ముంచడానికే బ్యారేజీలో అదనంగా నీటిని ఉంచారని చంద్రబాబు మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *