పేదలకు కేంద్రం శుభవార్త, ఉపాధి హామీ పనిదినాలు పెంపు !

కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎంతోమంది ఉద్యోగాలు పోయాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.

పేదలకు కేంద్రం శుభవార్త, ఉపాధి హామీ పనిదినాలు పెంపు !
Follow us

|

Updated on: Oct 12, 2020 | 6:02 PM

కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎంతోమంది ఉద్యోగాలు పోయాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) లక్ష్యాలను పెంచేందుకు మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండోసారి పనిదినాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశ జనాభాలోని ప్రతి ఐదుగురిలో ఒకరి పేరు ఉపాధి పథకంలో నమోదు చేయించేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. గత మేలో ఉపాధి హామీ స్కీమ్‌లోకి రూ.40వేల కోట్లను అదనంగా కేటాయించింది. ఒక్కో వ్యక్తికి 281 నుంచి 300 పనిదినాలను పెంచింది. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల్లో 320 కోట్ల పనిదినాలను కల్పించాలని కేంద్రం భావిస్తోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అలాగే ఉపాధి హామీ వేతనాలను కూడా కేంద్రం పెంచింది. యూపీ సహా ఎనిమిది పెద్ద రాష్ట్రాలు ఉపాధి హామీ స్కీమ్ కింద పనిదినాలను పెంచాలని కోరడంతో  కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది.

Also Read : పిల్లి పిల్ల‌ అనుకుని కొన్నారు..తీరా రెండేళ్ల తర్వాత..!

Latest Articles