ఈ నెల 22 నుంచి సీబీఎస్​ఈ సప్లిమెంటరీ పరీక్షలు

ఈ నెల 22 నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌ నిర్వహించనుంది సీబీఎస్​ఈ. అయితే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు, శానిటైజర్​ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

ఈ నెల 22 నుంచి సీబీఎస్​ఈ సప్లిమెంటరీ పరీక్షలు
Follow us

|

Updated on: Sep 05, 2020 | 8:31 AM

ఈ నెల 22 నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌ నిర్వహించనుంది సీబీఎస్​ఈ. అయితే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు, శానిటైజర్​ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. సెప్టెంబ‌ర్ 29 వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటితో పాటు 12 వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్స్ కూడా నిర్వ‌హించ‌నుంది.

అంతకుముందు కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌ వాయిదా వేయాలంటూ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తీవ్ర వ్యతిరేకతను తెలియజేసింది సీబీఎస్​ఈ. స్టూడెంట్స్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని సురక్షిత చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు వివ‌రించింది. కేసును కోర్టు ఈనెల 10కి వాయిదా వేసింది.

Also Read :

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : ఇక‌పై ఆ బాధ్య‌త‌ సచివాలయాలదే