UPSC Recruitment 2023: జియోలాజికల్ సర్వేలో ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్.. ఈ అర్హతలు అవసరం..

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జియోలాజికల్ సర్వేలో.. 10 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

UPSC Recruitment 2023: జియోలాజికల్ సర్వేలో ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్.. ఈ అర్హతలు అవసరం..
UPSC

Updated on: Jan 31, 2023 | 9:48 PM

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జియోలాజికల్ సర్వేలో.. 10 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, ఎంబీఏ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 16, 2023వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.25 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • మార్కెటింగ్ స్పెషలిస్ట్ లేదా ఎకనామిస్ట్ (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్‌ విభాగం) పోస్టులు: 1
  • ఆర్కైవిస్ట్- ఓరియంటల్ రికార్డ్స్(నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా) పోస్టులు: 1
  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) పోస్టులు: 8

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us