UPSC Indian Forest Service exam 2022 Notification: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS- 2022) ఎగ్జామినేషన్ 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, పరీక్ష విధానం, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పోస్టుల వివరాలు: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ – 2022
మొత్తం ఖాళీలు: 151
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2022 నాటికి 21 ఏళు ఉండాలి. అలాగే 32 ఏళ్లు మించకుండా ఉండాలి. అంటే ఆగస్టు 2, 1990 నుంచి ఆగస్టు 1, 2001 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు స్టేజ్‌లలో జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్ష:
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్ 5, 2022.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
ఓబీసీ/ఇతర అభ్యర్ధులకు రూ 100
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2022 (సాయంత్రం 6 గంటల వరకు).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: