TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో 69.46 శాతం మాత్రమే పాస్‌.. స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత శాతం

ఈ రోజు విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో కేవలం 69.46 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో ఫస్ట్ ఇయర్60.01 శాతం,  సెకండ్ ఇయర్ 64.19 శాతం మాత్రమే ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ ఏడాది జనరల్ కోర్సులో రెగ్యులర్‌ విద్యార్ధులు 4,01,445 మంది, ప్రైవేట్‌ విద్యార్ధులు 54,228 మంది, వొకేషన్‌ల్‌ రెగ్యులర్‌ 42,723, ప్రైవేట్‌లో 3,884 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు..

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో 69.46 శాతం మాత్రమే పాస్‌.. స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత శాతం
TS Inter

Updated on: Apr 24, 2024 | 12:59 PM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24: ఈ రోజు విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో కేవలం 69.46 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో ఫస్ట్ ఇయర్60.01 శాతం,  సెకండ్ ఇయర్ 64.19 శాతం మాత్రమే ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ ఏడాది జనరల్ కోర్సులో రెగ్యులర్‌ విద్యార్ధులు 4,01,445 మంది, ప్రైవేట్‌ విద్యార్ధులు 54,228 మంది, వొకేషన్‌ల్‌ రెగ్యులర్‌ 42,723, ప్రైవేట్‌లో 3,884 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. అంటే మొత్తం 8,31,858 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. వీరిలో 69.46 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 60.01 శాతం ఉత్తీర్ణత, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 64.16 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. వొకేషనల్ లో 63.86 శాతం ఉత్తీర్ణులయ్యారు.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ 2024 ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.

ఎంపీసీ గ్రూప్‌ టాప్‌.. హెఈసీ గ్రూప్‌ లీస్ట్

గ్రూప్‌ వైజ్‌ చూస్తే.. ఫస్ట్‌ ఇయర్‌ ఎంపీసీలో 68.52 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 73.85 శాతం ఉత్తీర్ణత పొందారు. బైపీసీలో ఫస్ట్‌ ఇయర్‌ 67.34 శాతం, సెకండ్‌ ఇయర్‌ 67.52 శాతం, సీఈసీ ఫస్ట్‌ ఇయర్‌ 41.73 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 44.81 శాతం, హెచ్‌ఈసీలో 31.57 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 43.51 శాతం, ఎమ్‌ఈసీ ఫస్ట్ ఇయర్‌లో 50.51 శాతం, సెకండ్ ఇయర్‌లో 59.93 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us