TSACS Recruitment 2022: హైదరాబాద్‌తో సహా వివిధ జిల్లాల్లో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా..

|

Sep 18, 2022 | 8:08 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఖమ్మం, హైదరాబాద్‌, నల్గొండ జిల్లాల్లో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కింద ఏఆర్టీ, ఐసీటీసీ, పీపీటీసీటీ సెంటర్లలో ఖాళీగా ఉన్న 33 మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్‌, ఫార్మసిస్ట్‌ తదితర (Medical Officer Posts) పోస్టుల భర్తీకి..

TSACS Recruitment 2022: హైదరాబాద్‌తో సహా వివిధ జిల్లాల్లో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా..
Tsacs
Follow us on

TSACS Medical Officer Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఖమ్మం, హైదరాబాద్‌, నల్గొండ జిల్లాల్లో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కింద ఏఆర్టీ, ఐసీటీసీ, పీపీటీసీటీ సెంటర్లలో ఖాళీగా ఉన్న 33 మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్‌, ఫార్మసిస్ట్‌ తదితర (Medical Officer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ (నర్సింగ్‌), జీఎన్‌ఎం, డీఫార్మసీ, బీఎస్సీ ఎంఎల్‌టీ, ఎండీ, డీఎన్‌బీ, ఎంబీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు అక్టోబర్‌ 10, 2022వ తేదీ నాటికి 30 నుంచి 40 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు సెప్టెంబర్‌ 20, 2022వ తేదీలోపు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌ లిస్టింగ్‌/ఇంటర్వ్యూ ఆధాకంగా ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.21,000ల నుంచి రూ.72,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు..

  • మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 4
  • స్టాఫ్ నర్స్ పోస్టులు: 2
  • ఫార్మసిస్ట్‌ పోస్టులు: 1
  • ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 9
  • క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టులు: 5
  • క్లినికల్ సర్వీసెస్ ఆఫీసర్ పోస్టులు: 5
  • డేటా మానిటరింగ్, డాక్యుమెంటేషన్ ఆఫీసర్ పోస్టులు: 5
  • జాయింట్ డైరెక్టర్ (ఐఈసీ) పోస్టులు: 1
  • డిప్యూటీ డైరెక్టర్ (ఐసీటీసీ) పోస్టులు: 1

అడ్రస్: Office of Project Director, Telangana State AIDS Control Society, Hyderabad.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.