TS SET-2022: టీఎస్‌ సెట్‌-2022 పరీక్ష వాయిదా.. కొత్త తేదీలు త్వరలో ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో టీఎస్‌ సెట్‌-2022 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు..

TS SET-2022: టీఎస్‌ సెట్‌-2022 పరీక్ష వాయిదా.. కొత్త తేదీలు త్వరలో ప్రకటన
TS SET-2022

Updated on: Mar 06, 2023 | 12:20 PM

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో టీఎస్‌ సెట్‌-2022 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మార్చి 13న నిర్వహించాల్సిన పరీక్షను మాత్రమే వాయిదా వేస్తున్నట్లు, 14, 15 తేదీలలో నిర్వహించే పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం యథావిథిగా నిర్వహిస్తామని వివరించారు. టీఎస్‌ సెట్‌-2022కు సంబంధించిన హాల్‌టికెట్లు మార్చి 10 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా సూచించారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

కాగా తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌-2022 నిర్వహణకు ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మార్చి 13, 14, 15 తేదీల్లో మొత్తం 29 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తొలుత ప్రకటించారు. ఐతే తాజాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 13వ తేదీ నిర్వహించవల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ తాజాగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us