TS EAPCET 2024 Toppers List: తెలంగాణ ఈఏపీసెట్ టాప్ 10 ర్యాంకర్లు వీరే.. ర్యాంక్ కార్డు డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే
తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం (మే 18) విడుదలయ్యాయి. దాదాపు మూడున్నర లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 91,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 89 శాతం, ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం ఉత్తీర్ణత..
హైదరాబాద్, మే 19: తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం (మే 18) విడుదలయ్యాయి. దాదాపు మూడున్నర లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 91,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 89 శాతం, ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డులను కూడా విద్యార్ధులకు అందుబాటులో ఉంచారు. ర్యాంక్ కార్డు పొందేందుకు విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, ఈఏపీసెట్ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. శనివారం విడుదలైన ఈఏపీసెట్ పలితాల్లో రెండు స్ట్రీమ్‌లలో టాప్ 10 ర్యాంకులు సాధించిన ర్యాంకర్లు వీరే..