TISS Mumbai Recruitment 2022: టిస్‌ ముంబాయిలో ఉద్యోగావకాశాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Mar 24, 2022 | 5:34 PM

భారత ప్రభుత్వానికి చెందిన ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్ (TISS).. ఒప్పంద ప్రాతిపదికన అకౌంట్స్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Accounts Assistant Posts) భర్తీకి అర్హులైన..

TISS Mumbai Recruitment 2022: టిస్‌ ముంబాయిలో ఉద్యోగావకాశాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Tiss Mumbai
Follow us on

TISS Mumbai Accounts Assistant Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్ (TISS).. ఒప్పంద ప్రాతిపదికన అకౌంట్స్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Accounts Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 2

పోస్టుల వివరాలు: అకౌంట్స్‌ అసిస్టెంట్‌ పోస్టులు.

వయోపరిమితి: మార్చి 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో బీకామ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ నైపుణ్యాలు కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్ధులకు: రూ. 500
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ. 250

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IIT Kanpur Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగాలు..నెలకు రూ.1,40,000ల జీతంతో..