నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్

టీజీపీఎస్సీ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో 19 సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్రికల్చర్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో ఎంఎస్‌సీ (అగ్రికల్చర్) అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 12, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికను రాత పరీక్ష ఆధారంగా నిర్వహించనున్నారు..

నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్
TGPSC Seed Certification Officer Recruitment

Updated on: Jul 20, 2026 | 11:43 AM

తెలంగాణ సీడ్ అండ్‌ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 12, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఐసీఏఆర్ (ICAR) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రానమీ లేదా ప్లాంట్ ఫిజియాలజీలో ఎంఎస్‌సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జులై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా 5 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్ట్ 12, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ / బీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించాలి. అదనంగా ప్రతి ఒక్కరూ పరీక్ష ఫీజు కింద రూ.80 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజును తప్పనిసరిగా చెల్లించాలి. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే రాత పరీక్ష ద్వారాఎంపిక చేస్తారు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

పరీక్ష విధానం ఇలా..

రాత పరీక్ష మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ విభాగం నుంచి 150 మార్కులు, పేపర్ 2కు సంబంధిత సబ్జెక్ట్ (పీజీ స్థాయి) నుంచి 150 మార్కులు చొప్పున పరీక్ష నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 12, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు
  • హాల్ టికెట్లు విడుదల: పరీక్షకు 7 రోజుల ముందు
  • పరీక్ష తేదీ: అక్టోబర్ 2026లో

టీజీపీఎస్సీ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us