TG TET 2026 Schedule: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పుడెప్పుడు ఏయే పరీక్షలంటే?

రాష్ట్ర టెట్ ఆన్‌లైన్ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఆదివారం విడుదల చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం మొత్తం 10 సెషన్లలో, 5 రోజుల పాటు ఆన్‌లైన్ పద్ధతిలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ కింద పూర్తి షెడ్యూల్ చెక్ చేసుకోండి..

TG TET 2026 Schedule: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పుడెప్పుడు ఏయే పరీక్షలంటే?
TG TET June Exam schedule

Edited By:

Updated on: May 31, 2026 | 4:02 PM

హైదరాబాద్‌, మే 31: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. టెట్ ఆన్‌లైన్ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఆదివారం విడుదల చేశారు. మొత్తం 10 సెషన్లలో, 5 రోజుల పాటు ఆన్‌లైన్ పద్ధతిలో ఈ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 16, 2026 నుండి జూన్ 22, 2026 మధ్య ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9:00 గంటల నుండి ఉదయం 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు జరగనున్నాయి.

తెలంగాణ టెట్ జూన్ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే..

  • జూన్ 16, 2026: షిఫ్ట్ 1 లో పేపర్-1 (ఇంగ్లీష్/తెలుగు మీడియం) – ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట జిల్లాల అభ్యర్థులకు పరీక్ష
    షిఫ్ట్ 2 (మధ్యాహ్నం 2:00 – 4:30): పేపర్-1 (ఇంగ్లీష్/తెలుగు మీడియం) – జనగాం, కరీంనగర్, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అభ్యర్థులకు.
  • జూన్ 17, 2026 (బుధవారం): షిఫ్ట్ 1 (ఉదయం 9:00 – 11:30):** పేపర్-1 (ఇంగ్లీష్/తెలుగు మీడియం) – హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి, ఇతర జిల్లాల వారికి పరీక్ష ఉంటుంది. షిఫ్ట్ 2 (మధ్యాహ్నం 2:00 – 4:30) పేపర్-II (మ్యాథ్స్ & సైన్స్) – (ఇంగ్లీష్/తెలుగు మీడియం) – ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నల్గొండ, యాదాద్రి భువనగిరి మరియు ఇతర జిల్లాలు వారికి పరీక్ష ఉంటుంది.
  • జూన్ 18, 2026 (గురువారం) షిఫ్ట్ 1 (ఉదయం 9:00 – 11:30) పేపర్-II (మ్యాథ్స్ & సైన్స్) – (ఇంగ్లీష్/తెలుగు మీడియం) – జనగాం, కరీంనగర్, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల వారికి వారికి పరీక్ష ఉంటుంది. షిఫ్ట్ 2 (మధ్యాహ్నం 2:00 – 4:30) పేపర్-II (మ్యాథ్స్ & సైన్స్) – (ఇంగ్లీష్/తెలుగు మీడియం) – హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, నాగర్‌కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాల వారికి వారికి పరీక్ష ఉంటుంది.
  • జూన్ 19, 2026 (శుక్రవారం) షిఫ్ట్ 1 (ఉదయం 9:00 – 11:30): పేపర్-II (సోషల్ స్టడీస్) – (ఇంగ్లీష్/తెలుగు మీడియం) – ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల వారికి పరీక్ష ఉంటుంది. షిఫ్ట్ 2 (మధ్యాహ్నం 2:00 – 4:30) పేపర్-II (సోషల్ స్టడీస్) – (ఇంగ్లీష్/తెలుగు మీడియం) – జనగాం, కరీంనగర్, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, యాదాద్రి భువనగిరి అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది.
  • జూన్ 22, 2026 (సోమవారం) షిఫ్ట్ 1 (ఉదయం 9:00 – 11:30): పేపర్-II (మ్యాథ్స్, సైన్స్ మరియు సోషల్ స్టడీస్) – మైనర్ లాంగ్వేజెస్ (హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం) – అన్ని జిల్లాల వారికి వారికి పరీక్ష ఉంటుంది. షిఫ్ట్ 2 (మధ్యాహ్నం 2:00 – 4:30): పేపర్-I – మైనర్ లాంగ్వేజెస్ (హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం, బెంగాలీ) – అన్ని జిల్లాల వారికి పరీక్ష ఉంటుంది.

పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలు, హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in లేదా https://schooledu.telangana.gov.in ను సంప్రదించాల్సిందిగా అధికారులు కోరారు.

Follow Us