
హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణ EAMCET లో ర్యాంక్ ప్రధానంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్. పరీక్ష కఠినత్వ స్థాయి, అభ్యర్థుల సంఖ్య, టై-బ్రేకింగ్ నియమాలు వంటి అంశాలు విద్యార్ధుల ర్యాంకును నిర్ణయిస్తాయి. ఈఏపీసెట్‌లో ఎక్కువ స్కోరు వస్తే నేరుగా మంచి ర్యాంకు పొందొచ్చు. తద్వారా JNTU-H, OU వంటి అగ్రశ్రేణి కాలేజీల్లో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంటుంది. 140 మార్కులకు పైగా స్కోరు సాధిస్తే అభ్యర్థులకు టాప్ 500 ర్యాంకులలో స్థానం లభిస్తుంది. అయితే స్కోరును తుది ర్యాంక్‌గా మార్చే విధానానికి అనేక ముఖ్యమైన అంశాలు ఆధారంగా చేసుకుంటారు.
అభ్యర్థుల సంఖ్య, పరీక్ష కఠినత్వ స్థాయి, నార్మలైజేషన్ ప్రక్రియ, టై-బ్రేకింగ్ నియమాలు.. ఈ నాలుగు అంశాలు తెలంగాణ ఈఏపీసెట్ ర్యాంకు నిర్ణంయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒకవేళ అభ్యర్ధుల్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి అభ్యర్థులు ఒకే మార్కులు సాధిస్తే అప్పుడు టై-బ్రేకింగ్ ప్రమాణాన్ని అనుసరిస్తారు. ఇందులో ఈఏపీసెట్‌లో మ్యాథ్స్‌లో పొందిన మార్కులు, ఫిజిక్స్‌లో వచ్చిన మార్కులతోపాటు ఇంటర్మీడియట్‌లో మొత్తం మార్కుల శాతం.. ఈ వివరాల ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. ఒకవేళ అప్పుడు కూడా స్కోర్ టై అయితే వయసులో పెద్ద అభ్యర్థికి తొలి ర్యాంకు కేటాయిస్తారు.
తెలంగాణ ఈఏపీసెట్ 2026 కటాఫ్ అనేది ఒక నిర్దిష్ట కోర్సు లేదా కాలేజీలో ప్రవేశానికి అవసరమైన కనీస ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. గత ఏడాది క్లోజింగ్ ర్యాంకులను గమనిస్తే..
కటాఫ్ అనేది కళాశాల, ఇంజనీరింగ్ బ్రాంచ్, అభ్యర్థి కేటగిరీలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSE), దాని అనుబంధ బ్రాంచ్‌లకు అత్యధిక డిమాండ్ ఉంటుంది. దీనివల్ల క్లోజింగ్ ర్యాంకులు అత్యల్పంగా ఉంటాయి.
తెలంగాణ ఈఏపీసెట్ 2026 పరీక్షకు హాజరైన విద్యార్ధులు తమ ర్యాంక్ ఆధారంగా ప్రవేశ అవకాశాలను పెంచుకోవడానికి కొన్ని వ్యూహాత్మక మార్గాలను అనుసరించాలి. అవేంటంటే..
మధ్యస్థ ర్యాంకు ఉన్నప్పటికీ కౌన్సెలింగ్ ప్రక్రియలో సమర్థవంతంగా పాల్గొనడం చాలా ముఖ్యం. అనుబంధంగా ఉన్న అన్ని కళాశాలలు, వాటి గత సంవత్సరం ముగింపు ర్యాంకుల గురించి పూర్తిగా స్టడీ చేయాలి. అన్ని కౌన్సెలింగ్ దశలలో అత్యంత అనువైన కాలేజీ, ర్యాంకుల డేటాను సమీక్షించాలి.
ప్రభుత్వ కాలేజీలకు మీ ర్యాంక్ సరిపోకపోతే మీ స్కోర్‌కు తగిన మేనేజ్‌మెంట్ కోటా ద్వారా ప్రవేశం కల్పించే ప్రతిష్టాత్మక ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందవచ్చు.
ఉన్నత ర్యాంకును లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే ఈఏపీసెట్ పరీక్ష రాసేందుకు మరోమారు ప్రయత్నించడం బెటర్. అందుకు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ ప్రారంభించాలి. గత పరీక్షలో చేసిన తప్పులను గుర్తించి వీక్‌గా ఉన్న టాపిక్‌లపై శ్రద్ధ పెట్టాలి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.