TG TET 2026 Exam: నిరుద్యోగులకు అలర్ట్‌.. తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేస్తుంది!

టెట్‌ 2026 నోటిఫికేషన్‌ త్వరలోనే విడుదల కానుంది. ఈ మేరకు టెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదలకు అనుమతి కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదన పంపింది. ప్రతి ఏటా రెండు సార్లు టెట్‌ నిర్వహిస్తామని రేవంత్‌ సర్కార్‌ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే..

TG TET 2026 Exam: నిరుద్యోగులకు అలర్ట్‌.. తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేస్తుంది!
Telangana TET Notification

Updated on: Apr 09, 2026 | 6:06 PM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2026 నోటిఫికేషన్‌ త్వరలోనే విడుదల కానుంది. ఈ మేరకు టెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదలకు అనుమతి కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదన పంపింది. ప్రతి ఏటా రెండు సార్లు టెట్‌ నిర్వహిస్తామని రేవంత్‌ సర్కార్‌ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీ మేరకు యేటా రెండు సార్లు టెట్ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో 2026 సంవత్సరానికి తొలి టెట్‌కు ఏప్రిల్‌ ఒకటీ లేదా రెండో వారంలో నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది.

అనంతరం జూన్‌లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వం అనుమతివ్వగానే నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న టీచర్లకు కూడా టెట్‌ తప్పనిసరి కావడంతో వేసవి సెలవుల్లోనే పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని కొందరు భావిస్తున్నారు. గతడాది చివర్లో విడుదలైన నోటిఫికేషన్ కు కూడా చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరైన సంగతి తెలిసిందే. టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే డీఎస్సీ రాసేందుకు జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది. బీఎడ్‌, డీఎడ్‌ అర్హత కలిగిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. టెట్‌లో ఎక్కువ స్కోర్ సాధించిన వారికి డీఎస్సీలో వెయిటేజ్‌ మార్కులు కలుస్తాయి. టెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది.

ఏప్రిల్ 20 నుంచి తెలంగాన ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు 2026 ఏప్రిల్‌ 20 నుంచి మొదలుకానున్నాయి. ఏప్రిల్‌ 27వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు టాస్‌ డైరెక్టర్‌ పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లను ఏప్రిల్‌ 9 నుంచి మీ సేవ వాట్సప్‌ సర్వీస్‌ 8096958096 మొబైల్‌ నంబరు నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా వీటిని పొందవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us