TG Polycet 2026 Application: రేపటితో ముగుస్తున్న పాలిసెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తులు.. రాత పరీక్ష తేదీ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'టీజీ పాలిసెట్-2026' దరఖాస్తు గడువు ముగింపు దశకు చేరుకుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్ 20వ తేదీతో ముగియనున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు..

TG Polycet 2026 Application: రేపటితో ముగుస్తున్న పాలిసెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తులు.. రాత పరీక్ష తేదీ ఇదే
Telangana Polycet Registration

Updated on: Apr 19, 2026 | 8:41 AM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘టీజీ పాలిసెట్-2026’ దరఖాస్తు గడువు ముగింపు దశకు చేరుకుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్ 20వ తేదీతో ముగియనున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు సోమవారం (ఏప్రిల్ 20) ముగింపు సమయంలోపు తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.

తెలంగాణ పాలీసెట్‌ 2026 ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేవాలు కల్పిస్తారు. ఇక పాలిసెట్ ప్రవేశ పరీక్ష మే 13న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పదో తరగతి అర్హత కలిగిన విద్యార్థులు ఎవరైనా గడువు ముగిసేలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • తెలంగాణ పాలీసెల్‌ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 20, 2026.
  • రూ.100 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 21-, 2026.
  • రూ.300 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 22, 2026.
  • తెలంగాణ పాలీసెట్‌ 2026 పరీక్ష తేదీ: మే 13, 2026.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us