TG Polycet 2026 Registration: తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ.. ముఖ్యమైన సూచనలు ఇవే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సీట్ల భర్తీకి తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 (టీజీ పాలిసెట్‌) నోటిఫికేషన్‌ గత నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని అన్ని..

TG Polycet 2026 Registration: తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ.. ముఖ్యమైన సూచనలు ఇవే
Telangana Polycet Registration

Updated on: Mar 15, 2026 | 4:33 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సీట్ల భర్తీకి తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 (టీజీ పాలిసెట్‌) నోటిఫికేషన్‌ గత నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌ వంటి తదితర కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు. ఇప్పటికే పాలీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎలాంటి ఆలస్య రుసుములేకుండా ఏప్రిల్‌ 20, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మే 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు పదోతరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఈ ఏడాది మార్చిలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించరు. విద్యార్ధులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 20. 2026.
  • రూ.100 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 21, 2026.
  • రూ.300 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 22, 2026.
  • తెలంగాణ పాలీసెట్‌ 2026 రాత పరీక్ష తేదీ: మే 13, 2026.

తెలంగాణ పాలిసెట్‌ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us