TG Inter Hall Tickets 2026: తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టికెట్లు 2026 బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి (TSBIE) ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు..

TG Inter Hall Tickets 2026: తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
TG Inter Hall Tickets

Updated on: Feb 18, 2026 | 9:26 PM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టికెట్లు 2026 బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి (TSBIE) ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి tgbieht.cgg.gov.in ద్వారా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 26న ప్రారంభమై, మార్చి 18 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను ఆయా జూనియర్‌ కాలేజీల్లోని ప్రిన్సిపళ్ల నుంచి డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. అలాగే విద్యార్థుల సౌకర్యార్థం ఆన్‌లైన్ పోర్టల్‌ నుంచి కూడా హాల్ టికెట్లను బోర్డు అందుబాటులోకి తెచ్చింది.

తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ల 2026 డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఫిబ్రవరి 20న విద్యార్థుల తల్లిదండ్రుల రిజిస్టర్డ్‌ వాట్సాప్‌నకు హాల్‌టికెట్లను పంపిస్తారు. అంటే విద్యార్థులు కాలేజీ లాగిన్‌ ఐడీ, ఇంటర్‌ అధికారిక వెబ్‌సైట్‌, వాట్సాప్‌.. ఇలా మొత్తం 3 విధానాల్లో ఏ విధంగానైనా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్‌ సంతకం లేకపోయినా విద్యార్ధులకు పరీక్షకు అనుమతిస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అయితే డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌ టికెట్లపై విద్యార్థులు తమ పేరు, ఫొటో, సబ్జెక్టుల్లో తప్పులు దొర్లితే కాలేజీ ప్రిన్సిపాళ్లను సంప్రదించి సవరించుకునే అవకాశం కల్పించారు. ఇంటర్‌ హాల్‌టికెట్లపై ముద్రించిన క్యూఆర్‌కోడ్‌ ఆధారంగా పరీక్షకేంద్రం రూట్‌మ్యాప్‌ ద్వారా సులువుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చు. కాగా ఈ ఏడాది ఇంటర్‌ వార్షిక పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,96,529 మంది హాజరుకాబోతున్నారు. ఇందుకు మొత్తం 1495 సెంటర్లు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us