Errors in Inter Hall Tickets 2026: ఇంటర్‌ హాల్‌టికెట్లలో తప్పులు దొర్లాయా..? ఇలా సింపుల్‌గా సరిచేసుకోండి

How to correct errors in intermediate 2026 hall tickets: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్లలో పేరు, చిరునామా, సబ్జెక్ట్‌లు, మీడియం వంటి ఇతర వివరాల్లో ఏమైనా తప్పులుంటే..

Errors in Inter Hall Tickets 2026: ఇంటర్‌ హాల్‌టికెట్లలో తప్పులు దొర్లాయా..? ఇలా సింపుల్‌గా సరిచేసుకోండి
Inter Hall Tickets

Updated on: Feb 20, 2026 | 2:32 PM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్లలో పేరు, చిరునామా, సబ్జెక్ట్‌లు, మీడియం వంటి ఇతర వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల దృష్టికి తీసుకెళ్లి వెంటనే సవరించుకోవాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష సమయం నాటికి సవరించిన హాల్‌ టికెట్లను మరోమారు జారీ చేస్తామని సూచించారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్‌ విద్యార్ధుల హాల్‌టికెట్లను ఆయా కాలేజీల లాగిన్‌లలో ఉంచిన విషయం తెలిసిందే. హాల్‌టికెట్లను ప్రిన్సిపాళ్లు తమ కాలేజీ లాగిన్‌ ఐడీ ఎంటర్‌ చేసి డౌన్‌లోడ్‌ చేయవల్సి ఉంటుంది. విద్యార్ధులకు అందజేసిన తర్వాత అందులోని వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో కోరారు. అలాగే ఫీజు చెల్లింపు సమయంలో విద్యార్థులు నమోదు చేసుకున్న మొబైల్‌ నంబర్లకు కూడా ఫిబ్రవరి 20 (శుక్రవారం) నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇంటర్‌ బోర్డు ఎస్‌ఎంఎస్‌ లింక్‌ పంపించబోతోంది. దాన్ని క్లిక్‌ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈసారి హాల్‌టికెట్లపై క్యూఆర్‌ను కూడా ముద్రించామని, దానివల్ల పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించవచ్చని ఆయన అన్నారు.

కాగా తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 26న ప్రారంభమై మార్చి 18 వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది ఇంటర్‌ వార్షిక పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,96,529 మంది హాజరుకాబోతున్నారు. ఇందుకు మొత్తం 1495 సెంటర్లు ఏర్పాటు చేశారు. పారదర్శకత కోసం ఈ ఏడాది సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us