TG High Court Jobs 2026: 7వ, 10వ తరగతి అర్హతతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.58 వేల జీతం

రాష్ట్ర హైకోర్టులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఆఫీస్..

TG High Court Jobs 2026: 7వ, 10వ తరగతి అర్హతతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.58 వేల జీతం
Telangana High Court Jobs

Updated on: Feb 23, 2026 | 8:20 AM

తెలంగాణ హైకోర్టులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఆఫీస్ సబార్డినెట్‌ పోస్టులు 34, డ్రైవర్ పోస్టులు 9 వరకు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 7వ తరగతి, పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 2026 జులై 1వ తేదీ నాటికి 46 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, వికలాంగ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 28, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు కింద జనరల్, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ (EWS), పీడబ్ల్యూడీ (PWD), మాజీ సైనికోద్యోగులు రూ.400 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష(సీబీటీ), స్కిల్ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకు రూ.19,000 నుంచి రూ.58,850 వరకు, డ్రైవర్‌ పోస్టులకు రూ.22,900 నుంచి రూ.69,150 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us