TS govt Jobs 2022: తెలంగాణ ఎక్సైజ్‌, రవాణా శాఖల నియామకాలన్నీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు పరిధిలోకే!

|

Apr 09, 2022 | 9:03 AM

తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) పరిధి మరింత విస్తృతం కానున్నట్లు తెలుస్తోంది. ఈ బోర్డు.. ఇప్పటివరకూ పోలీస్‌ సిబ్బంది నియామకాలను మాత్రమే చేపడుతుండగా..

TS govt Jobs 2022: తెలంగాణ ఎక్సైజ్‌, రవాణా శాఖల నియామకాలన్నీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు పరిధిలోకే!
Ts Police Recruitment
Follow us on

Telangana govt job recruitment process 2022: తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) పరిధి మరింత విస్తృతం కానున్నట్లు తెలుస్తోంది. ఈ బోర్డు.. ఇప్పటివరకూ పోలీస్‌ సిబ్బంది నియామకాలను మాత్రమే చేపడుతుండగా.. వీటితోపాటుగా కొత్తగా ఎక్సైజ్, రవాణా శాఖ సిబ్బంది నియామక బాధ్యతలనూ ఈసారి బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. ఇప్పటి వరకు ఎక్సైజ్‌ సిబ్బంది నియామకాలను ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగేవి. అలాగే రవాణా శాఖ సిబ్బంది నియామకాలు TSPSC నిర్వహించేది. బోర్డు ఆధ్వర్యంలో జరిగే నియామక ప్రక్రియ పకడ్బందీగా ఉండటానికితోడు ఎక్సైజ్, రవాణా శాఖలోనూ యూనిఫాం సర్వీసెస్‌కే చెందిన సిబ్బందిని నియమించాల్సి ఉన్నందున టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు శాఖల్లోనూ కానిస్టేబుళ్ల నియామకాలే అత్యధికం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడంలో దేహదారుఢ్య పరీక్షల నిర్వహణే కీలకం. ఇందులో కీలకమైన పరుగు పందెంలో పాల్గొనే అభ్యర్థులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(RFID) ట్యాగ్‌లను అమర్చడం ద్వారా అక్రమాలను నియంత్రిస్తున్నారు. దేశంలో ఈ తరహా నియామకాల ప్రక్రియ నిర్వహించడం అరుదు కావడం గమనార్హం. నియామకాల్లో ఇలా పారదర్శకతకు పెద్దపీట వేయడంతో 2018లో ఎలాంటి ఆరోపణలు లేకుండా సజావుగా ప్రక్రియను పూర్తి చేయగలిగారు. ఈ క్రమంలోనే టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చేతికే ఎక్సైజ్, రవాణా శాఖ సిబ్బంది నియామక ప్రక్రియను అప్పగించాలని నిర్ణయించారు.

17,000 పోలీస్, 212 రవాణా పోస్టులులకు త్వరలోనే నోటిఫికేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాల భర్తీలో భాగంగా తొలివిడతగా దాదాపు 30వేల ఉద్యోగాలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది. వీటిలో 17,000 పోలీస్, 212 రవాణా పోస్టులుండటంతో మండలి ఇప్పటికే ప్రాథమిక కసరత్తు చేపట్టింది. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడటమే ఆలస్యం నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉంది. తొలుత ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించాల్సి ఉండటంతో ఇందుకోసం ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమైంది. అలాగే దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీటీసీ, పీటీసీ, డీటీసీ, బెటాలియన్లలోని మైదానాలను సిద్ధం చేస్తోంది.

Also Read:

TS EDCET 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ముఖ్యమైన తేదీలివే!