SSC GD Exam 2026 Postponed: నిరుద్యోగులకు అలర్ట్‌.. 25,487 కానిస్టేబుల్‌ జీడీ రాత పరీక్షలు వాయిదా! కొత్త తేదీల ప్రకటన

సాయుధ దళాల్లో కానిస్టేబుల్‌ జీడీ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 25,487 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు మరో వారంలో నిర్వహించనున్న రాత పరీక్షలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి..

SSC GD Exam 2026 Postponed: నిరుద్యోగులకు అలర్ట్‌.. 25,487 కానిస్టేబుల్‌ జీడీ రాత పరీక్షలు వాయిదా! కొత్త తేదీల ప్రకటన
SSC GD Constable CBT exam postponed

Updated on: Feb 18, 2026 | 6:00 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17: భారత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సాయుధ దళాల్లో కానిస్టేబుల్‌ జీడీ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 25,487 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా కానిస్టేబుల్‌ (జీడీ) ఇన్‌ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఏపీఎఫ్‌) అండ్‌ ఎస్‌ఎస్‌ఎఫ్‌, అండ్‌ రైఫిల్‌మ్యాన్‌ (జీడీ) ఇన్ అస్సాం రైఫిల్స్‌ ఎగ్జామినేషన్‌ 2026 పోస్టుల పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మొదలవనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్‌ కూడా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ విడుదల చేసింది. కానీ అనూహ్యంగా ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎస్సెస్సీ మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదతల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.

గతంలో జారీ చేసిన పాత షెడ్యూల్‌ ప్రకారం కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఫిబ్రవరి 23 నుంచి జరగాల్సింది ఉంది. కొన్ని కారణాల వల్ల ఈ పరీక్షలు వాయిదా వేసింది. కొత్త తేదీ విడుదలైన తర్వాత సిటి ఇంటిమేషన్‌ కార్డులు పరీక్షకు 10 రోజుల ముందు, అడ్మిట్‌ కార్డులను పరీక్షకు 3 రోజుల ముందు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.

కానిస్టేబుల్‌ జీడీ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us