SSC Exam Dates 2026: స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ రాత పరీక్షల తేదీలు విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ ఎగ్జామ్‌ (CHSLE 2025) టైర్‌ 1, ఎస్‌ఎస్‌సీ జూనియర్‌ ఇంజినీర్‌ పేపర్‌ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ లను తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షల షెడ్యూల్‌ను స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం..

SSC Exam Dates 2026: స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ రాత పరీక్షల తేదీలు విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
SSC CHSL and JE exam dates

Updated on: Mar 11, 2026 | 6:53 AM

హైదరాబాద్‌, మార్చి 11: ఎస్సెస్సీ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ ఎగ్జామ్‌ (CHSLE 2025) టైర్‌ 1 పరీక్షలు ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో అర్హత సాధించిన వారికి టైర్‌ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల షెడ్యూల్‌ను స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌ 2 ఆన్‌లైన్‌ పరీక్ష ఏప్రిల్‌ 10న నిర్వహించనుంది. పరీక్షకు 4 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు విడుదల చేస్తారు. కాగా ఫిబ్రవరి 27న టైర్‌ 1 ఫలితాలు విడుదల చేయగా.. ఇందులో 39,901 మంది టైర్‌ 2 పరీక్షకు అర్హత సాధించినట్లు స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖల్లో మొత్తం దాదాపు 3,131 ఉద్యోగాలకు లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌-2 పరీక్ష షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎస్‌ఎస్‌సీ జూనియర్‌ ఇంజినీర్‌ పేపర్‌ 2 పరీక్ష షెడ్యూల్‌ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి సంబంధించి పేపర్‌ 2 పరీక్ష తేదీలను తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం పేపర్ 2 పరీక్ష ఏప్రిల్‌ 7న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా మార్చి 6న ఎస్‌ఎస్‌సీ జూనియర్‌ ఇంజినీర్‌ పేపర్‌ 1 పరీక్ష ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పేపర్ 1 పరీక్షను దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 3, 4, 5, 6, 13 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించింది. పేపర్‌ 2కు సివిల్‌ ఇంజినీరింగ్‌లో 11,593 మంది, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో 4,014 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు కమిషన్‌ ప్రకటించింది. కాగా ఈ నోటిఫికన్ కింద కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో గ్రూప్ బి (నాన్-గేజిటెడ్, నాన్-మినిస్టీరియల్) స్థాయిలో మొత్తం 1340 జూనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. పేపర్‌ 2 పరీక్షల తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించి తుది ఎంపిక జాబితాను విడుదల చేయనుంది.

ఇవి కూడా చదవండి

ఎస్‌ఎస్‌సీ జూనియర్‌ ఇంజినీర్‌ పేపర్‌ 2 పరీక్ష షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us