RRC Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వేలో 2,801 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు! లింక్ ఇదిగో

RRC Apprentice Recruitment 2026 Notification: సౌత్‌ సెంట్రల్ రైల్వే (SCR) రీజియన్లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ (RRC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 2,801 అప్రెంటిస్‌ పోస్టులను వివిధ విభాగాల్లో..

RRC Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వేలో 2,801 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు! లింక్ ఇదిగో
South Central Railway Apprentice Jobs

Updated on: Mar 15, 2026 | 3:21 PM

దక్షిణాదిలోని సౌత్‌ సెంట్రల్ రైల్వే (SCR) రీజియన్లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ (RRC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 2,801 అప్రెంటిస్‌ పోస్టులను వివిధ విభాగాల్లో భర్తీ చేయనుంది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, పర్సనల్‌, ఎస్‌ అండ్ టీ వంటి తదితర విభాగాల్లో ఈ ఖాళీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 11, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమైనాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతిలో అర్హత సాధించి ఉండాలి. అలాగే ఏసీ మెకానిక్‌, కార్పెంటర్‌, సీఓపీఏ, డీసిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌, మెషినిస్ట్‌, ఎంఎంటీఎం, మోటర్‌ మెకానిక్‌, పెయింటర్‌, వెల్డర్‌.. విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 ఏప్రిల్ 11వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి ఐదేళ్లు, ఓబీసీకి మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 11, 2026వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అభ్యర్ధుల తప్పనిసరిగా రూ.100 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, థార్డ్‌ జండర్‌ అభ్యర్ధులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే విద్యార్హతల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వివిధ రైల్వే యూనిట్లలో ఏడాది పాటు ట్రైనింగ్‌ అందిస్తారు. నిబంధనల మేరకు శిక్షణ సమయంలో ప్రతి నెలా స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది లింక్‌లో తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us