
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)లో ఉద్యోగం కోరుకునే వారికి భారీ శుభవార్త అదించింది. కాన్పూర్లోని ఆర్బీఐ బ్రాంచ్‌లో బ్యాంక్ మెడికల్ కన్సల్టెంట్ (Bank’s Medical Consultant – BMC) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. గంటల చొప్పున వేతనం అందిస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 2 బ్యాంక్ మెడికల్ కన్సల్టెంట్ (BMC) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ (MBBS) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్ మెడిసిన్‌లో ఎంఎస్/ఎండీ (MS/MD) చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. సంబంధిత వైద్య సేవల్లో అనుభవం ఉండటం అవసరం. ఈ అర్హతలు కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో జూలై 31, 2026లోపు దరఖాస్తులు సంబంధిత ఆర్‌బీఐ కార్యాలయానికి పోస్టు ద్వారా పంపించాలి. అభ్యర్థులు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, నిర్దేశిత దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి అవసరమైన ధ్రువపత్రాలతో కలిపి పంపాల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీఓ లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు గంటకు రూ.1,000 చొప్పున కాంట్రాక్ట్ ప్రాతిపదికన పారితోషికం అందజేస్తారు.
ఉద్యోగానికి సంబంధించిన పూర్తి అర్హతలు, విధులు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు చిరునామా వంటి వివరాల కోసం ఆర్‌బీఐ అధికారికలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని అభ్యర్థులకు సూచిస్తున్నారు.
రీజినల్ డైరెక్టర్, రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్ మెంట్, (రిక్రూట్మెంట్ సెక్షన్), మహాత్మా గాంధీ మార్గ్, కాన్పూర్.
భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.