RBI Jobs 2026: డిగ్రీ అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!

దేశవ్యాప్తంగా ఉన్న RBI బ్రాంచుల్లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. మొత్తం 650 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. మొత్తం ఖాళీల్లో హైదరాబాద్‌లో11 పోస్టులు ఉన్నాయి. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు

RBI Jobs 2026: డిగ్రీ అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!
RBI Assistant Recruitment

Updated on: Mar 10, 2026 | 10:32 AM

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. మొత్తం 650 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. మొత్తం ఖాళీల్లో హైదరాబాద్‌లో11 పోస్టులు ఉన్నాయి. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి8వ తేదీతో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉంది. అయితే దీనిని మార్చి 10వ తేదీ వరకు పొడిగిస్తూ ఆర్బీఐ ప్రకటన వెలువరించింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు మంగళవారం (మార్చి 10) రాత్రి 11.59 గంటలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏదైనా విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు డిగ్రీలో పాస్ మార్కులు ఉన్నా దరఖాస్తు చసుకోవచ్చు. డిగ్రీ అర్హతతోపాటు వర్డ్ ప్రాసెసింగ్‌లో కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. అలాగే సంబంధిత రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఫిబ్రవరి 1, 2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయసులో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.450, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.50 చొప్పున చెల్లించాలి. ప్రిలిమ్స్‌, మెయిన్‌ రాత పరీక్షలు, భాషా నైపుణ్య పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.58,514 జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 10, 2026.
  • ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 11, 2026.
  • మెయిన్ పరీక్ష తేదీ: జూన్‌ 7, 2026.

రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us