PGCIL Recruitment 2022: పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో 1166 అప్రెంటీస్‌ పోస్టులు.. ఈ అర్హతలుంటే నేరుగా జాబ్..

|

Jul 14, 2022 | 4:43 PM

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Powergrid).. హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో అప్రెంటిస్‌ (Apprentice Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

PGCIL Recruitment 2022: పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో 1166 అప్రెంటీస్‌ పోస్టులు.. ఈ అర్హతలుంటే నేరుగా జాబ్..
Pgcil
Follow us on

PGCIL Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Powergrid).. హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో అప్రెంటిస్‌ (Apprentice Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 1166

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: అప్రెంటిస్‌ పోస్టులు

విభాగాలు: గ్రాడ్యుయేట్‌ (కంప్యూటర్ సైన్స్‌/సివిల్‌/ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్‌), హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌, డిప్లొమా (సివిల్‌/ఎలక్ట్రీషియన్‌/ఎలక్ట్రికల్‌) తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా/బీఈ/బీటెట్‌/బీఎస్సీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పని చేయవల్సిన ప్రదేశాలు: గురుగ్రాం, ఫరీదాబాద్‌, జమ్ము, లక్నో, పాట్న, కోల్‌కతా, షిల్లాంగ్‌, భువనేశ్వర్, నాగ్‌పూర్‌, వడోదర, హైదరాబాద్‌, బెంగళూర్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.