PFC Recruitment 2022: నెలకు రూ.180000ల జీతంతో.. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖకు చెందిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

|

Sep 25, 2022 | 7:46 AM

భారత ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (Power Finance Corporation) వివిధ పీఎఫ్‌సీ యూనిట్లలో ఖాళీగా .. 22 అసిస్టెంట్ ఆఫీసర్(అడ్మినిస్ట్రేషన్‌), డిప్యూటీ ఆఫీసర్(ఎస్టేట్ & బిల్డింగ్ మేనేజ్‌మెంట్)(సివిల్/ ఎలక్ట్రికల్), అసిస్టెంట్ మేనేజర్(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్) తదితర పోస్టుల (Assistant Officer Posts)..

PFC Recruitment 2022: నెలకు రూ.180000ల జీతంతో.. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖకు చెందిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..
Pfc
Follow us on

Power Finance Corporation Assistant Officer Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (Power Finance Corporation) వివిధ పీఎఫ్‌సీ యూనిట్లలో ఖాళీగా .. 22 అసిస్టెంట్ ఆఫీసర్(అడ్మినిస్ట్రేషన్‌), డిప్యూటీ ఆఫీసర్(ఎస్టేట్ & బిల్డింగ్ మేనేజ్‌మెంట్)(సివిల్/ ఎలక్ట్రికల్), అసిస్టెంట్ మేనేజర్(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్) తదితర పోస్టుల (Assistant Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సీఏ/ సీఎంఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా/ పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 31 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 14, 2022 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.500లు దరఖాస్తు రుసుముగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.30,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • అసిస్టెంట్ ఆఫీసర్(అడ్మినిస్ట్రేషన్‌)/ ఇఓ: 4 పోస్టులు
  • డిప్యూటీ ఆఫీసర్(ఎస్టేట్ & బిల్డింగ్ మేనేజ్‌మెంట్)(సివిల్/ ఎలక్ట్రికల్)/ ఇ-1 పోస్టులు: 2
  • అసిస్టెంట్ మేనేజర్(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్)/ ఇ-3 పోస్టులు: 1
  • అసిస్టెంట్ మేనేజర్ (అప్లికేషన్ డెవలప్‌మెంట్)/ ఇ-3 పోస్టులు: 1
  • అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్/కమర్షియల్) ఇ-3 పోస్టులు: 7
  • అసిస్టెంట్ మేనేజర్(ప్రాజెక్ట్స్) ఇ-3 పోస్టులు: 7

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.