JEE Main 2026 Correction Window: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 దరఖాస్తు సవరణకు అవకాశం.. వీటిని మార్చేందుకు ‘నో’ ఛాన్స్‌

జేఈఈ మెయిన్ 2026 సెషన్‌ 2 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో మ3 రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఫిబ్రవరి 25తో ఆన్‌లైన్‌ దరఖాస్తులు ముగియనున్నాయి. అయితే దరఖాస్తు క్రమంలో వచ్చిన తప్పులను సవరణ చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ..

JEE Main 2026 Correction Window: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 దరఖాస్తు సవరణకు అవకాశం.. వీటిని మార్చేందుకు ‘నో’ ఛాన్స్‌
JEE Main 2026 Session 2 Correction

Updated on: Feb 22, 2026 | 7:31 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22: జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2026 సెషన్‌ 2 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో మ3 రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఫిబ్రవరి 25తో ఆన్‌లైన్‌ దరఖాస్తులు ముగియనున్నాయి. అయితే దరఖాస్తు క్రమంలో వచ్చిన తప్పులను సవరణ చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చని ఎన్టీయే ప్రకటించింది. ఫిబ్రవరి 28న రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు సవరణకు అవకాశం కల్పించింది. అయితే తప్పుల సవరణకు అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

జేఈఈ మెయిన్ సెషన్ 2 దరఖాస్తు సవరణకు ఒక్కసారి మాత్రమే అనుమతి ఉంటుంది. దరఖాస్తు సమయంలో వివరాలు తప్పుగా నమోదుచేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవచ్చు. ఫిబ్రవరి 28 తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ సవరణకు అవకాశం ఇవ్వరు. కాబట్టి అభ్యర్ధులు జాగ్రత్తగా వివరాలను సవరించుకోవాలని ఎన్టీఏ సూచించింది. కాగా ప్రస్తుతం జేఈఈ (మెయిన్‌) సెషన్‌ 2కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే జేఈఈ మెయిన్‌ తొలి సెషన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో సాధించిన పర్సంటైల్‌తో సంతృప్తి చెందని విద్యార్థులు మెరుగైన స్కోరు కోసం ఫిబ్రవరి 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 1 నుంచి 9 వరకు రోజుకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.

ఇవి మార్చేందుకు ‘నో’ ఛాన్స్‌

జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులో అభ్యర్థి మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌, అడ్రస్‌, ఎమర్జెన్సీ కాంటాక్టు వివరాలు, అభ్యర్థి ఫొటోను మార్చడానికి అవకాశం లేదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేర్లలో ఏదో ఒకటి మాత్రమే సవరించేందుకు అవకాశం ఉంటుంది. పదో తరగతి, 12వ తరగతి సంబంధిత వివరాలు, పాన్‌ కార్డు నంబర్‌, పరీక్ష కేంద్రం, మాధ్యమాన్ని మార్చుకొనేందుకు కూడా అవకాశం ఉంటుంది. వీటితోపాటు అభ్యర్థి పుట్టిన తేదీ, జెండర్‌, కేటగిరీ, సంతకం, పేపర్‌ ఆప్షన్‌ మార్చుకొనేందుకు కూడా అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌ 2 కరెక్షన్‌ విండో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us