NIWE Recruitment 2022: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ విండ్‌ ఎనర్జీ.. 16 ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

NIWE Recruitment 2022: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..
NIWE Chennai Recruitment 2022

Updated on: Oct 30, 2022 | 7:33 AM

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ విండ్‌ ఎనర్జీ.. 16 ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌, టెక్నికల్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిగ్రీ/బీఈ/బీటెక్‌/డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంబీఏ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.