NIELIT Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో నీలిట్‌లో 98 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ.70,000ల జీతంతో..

|

Apr 12, 2022 | 7:17 PM

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (NIELIT) ఢిల్లీ సెంటర్‌.. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రోగ్రామర్..

NIELIT Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో నీలిట్‌లో 98 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ.70,000ల జీతంతో..
Nielit
Follow us on

NIELIT Assistant Programmer Recruitment 2022: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (NIELIT) ఢిల్లీ సెంటర్‌.. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రోగ్రామర్ (Assistant Programmer Posts), అసిస్టెంట్‌ నెట్‌వర్క్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 98

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రోగ్రామర్లు, అసిస్టెంట్‌ నెట్‌వర్క్‌ ఇంజినీర్లు, సీనియర్ ప్రోగ్రామర్‌, నెట్‌వర్క్‌ స్పెషలిస్టులు, సిస్టమ్ అనలిస్టులు, చీఫ్‌ రిసోర్స్‌ పర్సన్‌, సీనియర్‌ రిసోర్స్‌ పర్సన్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌ తదితర పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.22,514 నుంచి రూ.70,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌తో పాటు సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్ధులకు: రూ.600
ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు: రూ.300

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ICHR Recruitment 2022: ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రిసెర్చ్‌ ఎగ్జామినేషన్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ఎన్ని ఖాళీలున్నాయంటే..