
హైదరాబాద్, ఆగస్ట్ 11: NEET PG 2026 పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష నగర వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. NEET PG 2026 పరీక్షను ఆగస్టు 30, 2026న దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నట్లు NBEMS ఇప్పటికే ప్రకటించింది.
ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లో అభ్యర్థి పేరు, అప్లికేషన్ నంబర్, కేటాయించిన పరీక్ష నగరం తదితర వివరాలు ఉంటాయి. ఈ వివరాల ఆధారంగా అభ్యర్థులు పరీక్షకు వెళ్లేందుకు ముందుగానే ప్రయాణం, వసతి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను అడ్మిట్ కార్డుగా పరిగణించకూడదు. అసలు NEET PG అడ్మిట్ కార్డును NBEMS తరువాత ప్రత్యేకంగా విడుదల చేస్తుంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డు విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనలను కూడా గమనించాలి.
ఎగ్జామ్ సిటీ వివరాలు వచ్చిన వెంటనే అభ్యర్థులు తమ పరీక్షా నగరాన్ని చెక్ చేసుకోవాలి. ఇతర నగరానికి పరీక్ష కేంద్రం కేటాయించినట్లయితే ప్రయాణ టికెట్లు, వసతి తదితర ఏర్పాట్లను ముందుగానే చేసుకోవడం మంచిది. అలాగే అడ్మిట్ కార్డు విడుదల తేదీ, పరీక్షా కేంద్రం పూర్తి చిరునామా, పరీక్ష సమయం వంటి వివరాల కోసం NBEMS అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలి.