NCPOR Recruitment: నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషియన్‌ రిసెర్చ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ..

NCPOR Recruitment: నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషియన్‌ రిసెర్చ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. గోవాలో ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో ఖాళీలను...

NCPOR Recruitment: నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషియన్‌ రిసెర్చ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ..
Ncpor Jobs

Updated on: Aug 30, 2022 | 9:36 AM

NCPOR Recruitment: నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషియన్‌ రిసెర్చ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. గోవాలో ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 67 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, ఆఫీసర్‌ వంటి ఖాళీలు ఉన్నాయి.

* జియాలజీ, ఎర్త్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల 35 నుంచి 50 ఏళ్ల వయసు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 35,400 నుంచి రూ. 56,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 30-08-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి…