NBCC Recruitment: ఎన్‌బీసీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం పొందే అవకాశం..

NBCC Recruitment: భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఎన్‌బీసీసీ (ఇండియా) లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయనున్నారు...

NBCC Recruitment: ఎన్‌బీసీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం పొందే అవకాశం..

Updated on: May 21, 2022 | 9:02 PM

NBCC Recruitment: భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఎన్‌బీసీసీ (ఇండియా) లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అడిషనల్‌ జనరల్‌ మేనేజర్లు (సివిల్‌): 06, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (09), స్టెనోగ్రాఫర్‌ (01) పోస్టులు ఉన్నాయి.

* అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సివిల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు (హెచ్‌ఆర్‌ఎం) పోస్టులకు 60 శాతం మార్కులతో హెచ్ఆర్‌ఎం స్పెషలైజేషన్‌తో ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. స్టెనోగ్రఫీ/ ఇంగ్లిష్‌లో టైపింగ్‌ స్పీడ్‌తో పాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం తప్పనిసరి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను పోస్టుల ఆధారంగా కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 25,000 నుంచి రూ. 2,20,000 జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 16-06-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us