Jobs in Mysore 2021: ఇంటర్ పాసై.. కంప్యూటర్ టైపింగ్ లో మంచి ప్రావీణ్యత ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మైసూర్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ ఫుడ్ టెక్నాలాజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) ఉద్యోగాల రిలీజ్ చేసింది. తమ సంస్థలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత కలిగి ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం కోసం పూర్తి వివరాలను నోటిఫికేషన్::https://drive.google.com/file/d/1Cee452FBAKLDf-NL-vhBpp-0wwV0TXTy/view కి వెళ్లి తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వెబ్ సైట్ :https://cftri.res.in/recruitments/regular_positions/1 లోకి వెళ్లి సంబంధిత పోస్టుల కు అప్లై చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది. జూలై 30 వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఉద్యోగవివరాలు : జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్.
మొత్తం ఖాళీలు : 12
అర్హత : 10+2 ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
వయస్సు : 28 ఏళ్లు మించకుండా ఉండాలి
వేతనం : నెలకు రూ. 20,000 – 81,000 /-
ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు చేసుకునే విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి రుసుము లేదు
Also Read: కూరల్లో మసాలా కోసం ఉపయోగించే ధనియాలు..ఔషధగుణాల నిలయం.. ఆరోగ్యానికి ఎంత మేలంటే..