KVS Admissions 2022-23: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు తుది గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

|

Apr 10, 2022 | 8:46 AM

కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 2022-23 విద్యాసంవత్సరానికిగానూ ఒకటో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 13 వరకు పొడిగించబడింది..

KVS Admissions 2022-23: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు తుది గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..
Kvs Admissions 2022
Follow us on

KVS Admission 2022 application last date for 1st class: కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 2022-23 విద్యాసంవత్సరానికిగానూ ఒకటో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 13 వరకు పొడిగించబడింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్ kvsonlineadmission.kvs.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం దరఖాస్తు గడువు ఏప్రిల్ 11తో ముగియనుండగా, కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతికి (KVS class 1 admissions) రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడంతో.. తాజాగా చివరితేదీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఏడాది కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 28 (సోమవారం) ప్రారంభమైన సంగతి తెలిసిందే.

KVS Class 1 Admission 2022కు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ kvsonlineadmission.kvs.gov.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజ్‌లో కనిపించే రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఫస్ట్‌ టైం రిజిస్ట్రేషన్‌ చేశాక, అడ్మిషన్ అప్లికేషన్ పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.
  • తగిన సమాచారాన్ని అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్‌లో నింపి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, సబ్‌మిట్‌ చెయ్యాలి.
  • పూరించిన దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని, ప్రింట్‌ఔట్‌ తీసుకోవాలి.

Also Read:

KVS Admissions 2022-23: కేంద్రీయ విద్యాలయాల్లో 2-10 తరగతుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. చివరితేదీ ఇదే..