
హైదరాబాద్, అక్టోబర్ 30: నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అలర్ట్. జవహర్ నవోదయ విద్యాలయ సమితి (NVS) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST) హాల్‌టికెట్లను అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆన్‌లైన్ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే JNVST పరీక్ష నవంబర్ 28న జరగనుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రం, పరీక్ష సమయం, విద్యార్థి వివరాలు తదితర సమాచారం అడ్మిట్ కార్డులో ఉంటుంది.
JNVST 2026 హాల్‌టికెట్ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హాల్‌టికెట్‌లో విద్యార్థి పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ వంటి వివరాలను సరిచూసుకోవాలి. పరీక్ష రోజున అడ్మిట్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదురుకాకుండా వీలైనంత త్వరగా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. నవోదయ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు పరీక్షకు ముందే హాల్‌టికెట్ వివరాలను పరిశీలించుకుని, పరీక్షకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి.