JEE Main Exams 2026: రేపట్నుంచే జేఈఈ మెయిన్‌ 2026 సెషన్ 2 పరీక్షలు.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌

జేఈఈ మెయిన్‌ 2026 సెషన్ 2 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు రేపట్నుంచి (ఏప్రిల్ 2) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఏప్రిల్ 2, 4 తేదీల్లో జరగబోయే పేపర్‌ 1 (బీఈ, బీటెక్‌) అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను

JEE Main Exams 2026: రేపట్నుంచే జేఈఈ మెయిన్‌ 2026 సెషన్ 2 పరీక్షలు.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌
JEE Main 2026 Session 2 Exams

Updated on: Apr 01, 2026 | 6:00 AM

హైదరాబాద్, మార్చి 31: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (జేఈఈ మెయిన్‌) 2026 సెషన్ 2 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు రేపట్నుంచి (ఏప్రిల్ 2) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఏప్రిల్ 2, 4 తేదీల్లో జరగబోయే పేపర్‌ 1 (బీఈ, బీటెక్‌) అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్‌ 5, 7, 8 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మి్‌ట్‌ కార్డులు త్వరలోనే విడుదల కానున్నాయి. ఆయా తేదీల్లో జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. దేశంతో పాటు విదేశాల్లోని 15 ప్రధాన నగరాల్లో కూడా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసేటప్పుడు అడ్మిట్ కార్డ్‌పై QR కోడ్,బార్‌కోడ్ స్పష్టంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అభ్యర్థులు 011-40759000 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు లేదా jeemain@nta.ac.in కు ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

జేఈఈ మెయిన్ 2062 సెషన్ 2 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పరీక్ష రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఇక అభ్యర్ధులు తమ పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు అడ్మిట్ కార్డుతో పాటు ఆన్‌లైన్ దరఖాస్తులో అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ ఫొటో ఐడీని తమ వెంట తప్పనిసరిగా తీసుకెళ్లాలి. జనవరిలో జరిగిన మొదటి సెషన్ ఫలితాలను ఫిబ్రవరి 16న విడుదల చేశారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఏప్రిల్ సెషన్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 20 నాటికి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ఇవి కూడా చదవండి

జేఈఈ మెయిన్ 2062 సెషన్ 2 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏప్రిల్‌ 23 నుంచి అడ్వాన్స్‌డ్‌ 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు

ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇటీవల ఐఐటీ రూర్కీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పూర్తి నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు భారీగానే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో 13, ఆంధ్రప్రదేశ్‌లో 24 ప్రాంతాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు పోటీ కూడా కాస్త గట్టిగానే ఉంటుంది. జేఈఈ మెయిన్‌ రెండు విడతల్లో తొలి 2.50 లక్షల ర్యాంకులు సాధించిన వారిని మాత్రమే ఈ పరీక్షకు అనుమతిస్తారు. ఈ ఏడాదికి మే 17వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2026ను దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు.

జేఈఈ మెయిన్ 2062 సెషన్ 2 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us