JEE Main 2026 Result Date: జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ఫైనల్ ఆన్సర్ ‘కీ’ వచ్చేసింది.. ఏ క్షణమైనా ఫలితాలు విడుదల!

బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 పేపర్ 2 పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పేపర్‌ 2 పరీక్ష జనవరి 29న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ కీ ఇటీవల విడుదల చేసింది..

JEE Main 2026 Result Date: జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ఫైనల్ ఆన్సర్ ‘కీ’ వచ్చేసింది.. ఏ క్షణమైనా ఫలితాలు విడుదల!
JEE Main Paper 2 Final Answer Key

Updated on: Feb 24, 2026 | 6:57 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24: దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 పేపర్ 2 పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పేపర్‌ 2 పరీక్ష జనవరి 29న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ కీ ఇటీవల విడుదల చేసింది. దీనిపై అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 19 నుంచి 20 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. వీటిని పరిశీలించిన ఎన్టీయే తాజాగా తుది కీ కి సంబంధించిన పీడీఎఫ్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇక ఈ రోజు లేదంటే రేపు.. ఈ రెండు రోజుల వ్యవధిలో జేఏఏ మెయిన్‌ పేపర్‌ 2 పరీక్షకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయనుంది.

కాగా జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్‌ పేపర్‌ 1 ఫలితాలు ఇటీవల ఎన్‌టీఏ (NTA) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫైనల్ ఆన్సర్‌కీతోపాటు ఫలితాలను కూడా ఎన్టీయే ప్రకటించింది. అయితే పేపర్ 2 ఫలితాలు మాత్రం వెల్లడించలేదు. వీటి ఫలితాలు కూడా రెండు రోజుల వ్యవధిలో ఏ క్షణమైన విడుదల చేసే అవకాశం ఉంది.

జేఈఈ మెయిన్ 2026 పేపర్‌ 2 తుది ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల 2026 షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) ఏప్రిల్‌/ మే సెషన్‌ పది, ఇంటర్మీడియట్‌ 2026 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 20 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ రెండు సెషన్‌లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ ఏప్రిల్‌ 28 నుంచి మే 5 వరకు జగనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొంది.

తెలంగాణ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల 2026 షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us