IWAI Recruitment 2022: నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో.. ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ ఓడరేవుల షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడాలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 14 డిప్యూటీ డైరెక్టర్, ఈడీపీ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ..

IWAI Recruitment 2022: నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో.. ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..
IWAI Noida Recruitment 2022

Updated on: Nov 10, 2022 | 3:51 PM

భారత ప్రభుత్వ ఓడరేవుల షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడాలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 14 డిప్యూటీ డైరెక్టర్, ఈడీపీ అసిస్టెంట్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, స్టెనోగ్రాఫర్-డి, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇంగ్లిష్‌/హిందీ టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి. తెలంగాణ స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 44 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఎవరైనా డిసెంబర్‌ 17, 2022వ తేదిలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.19,900ల నుంచి రూ.2,08,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us