
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆధ్వర్యంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (VSSC).. సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో విద్యార్థుల కోసం వివిధ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటనల వెలువరించింది. సంబంధిత విభాగాల్లో BTech, BE, MTech, ME, MSc, ఇంటిగ్రేటెడ్ MSc, MTech, BS-MS, PhD ప్రోగ్రామ్‌లను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎవరైనా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) మానవ వనరుల అభివృద్ధి విభాగం అందించే వివిధ రకాల ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ISRO, అంతరిక్ష శాఖ (DoS)కి సంబంధించిన సైన్స్, టెక్నాలజీ రంగాలలో అభ్యసిస్తున్న భారతీయ విద్యార్ధులు మాత్రమే ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ (BTech, BE, MTech, ME, MSc, ఇంటిగ్రేటెడ్ MSc/MTech, BS-MS & PhD) చదువుతున్న విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులు తమ సెమిస్టర్ పరీక్షల్లో కనీసం 60 శాతం మార్కులు లేదా 10 పాయింట్ల స్కేల్‌పై 6.32 CGPA సాధించి ఉండాలి. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు VSSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను మార్చి 16, 2026 తేదీ వరకు స్వీకరిస్తారు. ఇంటర్న్‌షిప్ వ్యవధి కనిష్టంగా 21 రోజులు, గరిష్టంగా 45 రోజుల వరకు ఉంటుంది. ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు ఎటువంటి స్టైఫండ్, వేతనం లేదా ఆర్థిక సహాయం అందించబడవు.
యూజీ, పీజీ విద్యార్ధులైతే డిగ్రీలో మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. పీహెచ్‌డీ స్కాలర్లు తమ కోర్సువర్క్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య సౌకర్యాల లభ్యత ఆధారంగా మారే అవకాశం ఉంది. వచ్చిన దరఖాస్తులను ఆమోదించడం లేదా తిరస్కరించే అధికారం ఎల్లప్పుడూ సెంటర్‌కు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఇమెయిల్ ద్వారా నోటిఫై చేస్తారు. మరిన్ని కోర్సుల వివరాలకు అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు.
ఇస్రో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సులను.. BE, B.Tech డిగ్రీల కింద అందిస్తారు. అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో BS-MS, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో BSc, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ MSc, ఇంటిగ్రేటెడ్ MTech, ME, MTech, వాతావరణ శాస్త్రాలలో MSc, వాతావరణ శాస్త్రం, సముద్ర శాస్త్రం, స్పేస్ ఫిజిక్స్, స్పేస్ సైన్స్, టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్‌లో కంప్యూటర్ సైన్స్, PhD ప్రోగ్రామ్‌లను అందిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.