Indian Navy Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ (Indian Navy ).. సివిలియన్ పోస్టుల (civilian posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను అబ్సార్‌ప్షన్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 127
పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్, ఫైర్ మెన్, పెస్ట్‌కంట్రోల్ వర్కర్ పోస్టులు
అర్హతలు: పోస్టును బట్టి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
పే స్కేల్:
ఫార్మసిస్ట్ పోస్టులకు నెలకు రూ. 29,200
ఫైర్ మెన్ పోస్టులకు నెలకు రూ. 19,900
పెస్ట్‌కంట్రోల్ వర్కర్ పోస్టులకు నెలకు రూ. 18,000లు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వెస్టర్న్ నావెల్ కమాండ్, బాల్లాడ్ పీర్, టైగర్ గేట్, ముంబాయి 400001.
దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్ విడుదలైన 60 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి (ఏప్రిల్ 25, 2022).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: