Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన న్యూఢిల్లీలోని అడిషనల్ డైరెక్టరేట్ జనరల్, డీజీవోఎల్ అండ్ ఎస్‌ఎంలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 41 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో స్టెనో గ్రేడ్-2, లోయర్ డివిజన్ క్లర్క్, ట్యాలీ క్లర్క్, కుక్, ఎంటీఎస్ (సఫాయివాలా, వాచ్‌మెన్, మెసంజర్), అసిస్టెంట్ అకౌంటెంట్, కార్పెంటర్, రెగ్యులర్ లేబరర్ వంటి పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుఉనే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి/ తత్సమాన, ఇంటర్మీడియట్, బీకామ్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇంగ్లిష్‌లో టైపింగ్ నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ది కమాండెంట్, హెడ్ క్వార్టర్స్, సెకండ్ ఫ్లోర్, నావ్ భవన్ బిల్డింగ్, కమాని మార్గ్, బల్లార్డ్, ముంబయి, 40001 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను రాత పరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 06-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
IND vs WI: టీమ్ ఇండియాలోకి మళ్లీ ‘కుల్చా’ జోడి.. మ్యాజిక్ పనిచేసేనా..?
SAVING ACCOUNTS : రెండు కంటే ఎక్కువ పొదుపు ఖాతాలుంటే లాభమా.. నష్టమా..?