
భారత సైన్యంలో అగ్నిపథ్ పధకం కింద అగ్నివీర్ కొలువుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2027 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంటూరు, సికింద్రాబాద్, విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ ఈ మేరకు మొత్తం 25 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. అవివాహిత పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో 1 ఏప్రిల్ 2026 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
అగ్నివీర్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు 10వ తరగతిలో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అగ్నివీర్ (టెక్నికల్) పోస్టులకు ఇంటర్మీడియట్ (సైన్స్)లో ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్ తో పాటు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా సంబంధిత విభాగంలో టెక్నికల్ డిప్లొమా కలిగి ఉండాలి. అగ్నివీర్ (క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్) ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. అగ్నివీర్ (ట్రేడ్స్‌మెన్) పోస్టులకు 8వ లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థుల ఎత్తు 162 సెం.మీ నుంచి 170 సెం.మీ వరకు ఉండాలి. వయోపరిమితి పదిహేడున్నర ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1 జులై 2005 నుంచి 1 జులై 2009 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నివీర్ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్షలు 1 జూన్ నుంచి 15 వరకు జరుగుతాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేల నుంచి రూ.40 వేల వరకు జీతంతో పాటు రిస్క్ అండ్ హార్డ్‌షిప్, రేషన్, డ్రెస్, ట్రావెల్ అలవెన్సులు వర్తిస్తాయి. అలాగే రూ.48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.
తొలి దశలో నిర్వహించే ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CEE) మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో కూడిన ఆబ్జెక్టివ్ పరీక్ష. ఈ పరీక్షను తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో రాసే అవకాశం ఉంటుంది. అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇందులో కనీస అర్హత మార్కులు సాధించని వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 4 ఏళ్ల కాలపరిమితికి విధులు నిర్వహించవల్సి ఉంటుంది.
భారత సైన్యంలో అగ్నివీర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.