
భారత త్రివిధ దళాల్లో ఒకటైన భారత వైమానిక దళం (ఐఏఎఫ్).. వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 47 లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్- ఆర్డినరీ గ్రేడ్ (సీఎంటీడీ) పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు.. ఎల్‌డీసీ, హిందీ టైపిస్ట్‌కు ఇంటర్మీడియట్ ఉత్తర్ణతతో పాటు నిమిషానికి 35 పదాల ఇంగ్లిష్, హిందీ టైపింగ్ వేగం కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టులకైతే 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు, లైట్, హెవీ వెహికల్స్ నడిపేందుకు చెల్లుబాటు అయ్యే సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే కనీసం రెండేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చిరునామాకు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇండియాన్ ఎయిర్ ఫోర్స్ (IAF)లో డ్రైవర్, టైపిస్ట్ పోస్టులకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.