IIM Recruitment: ఐఐఎంలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం పొందే అవకాశం..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. జమ్మూ క్యాంపస్‌లో ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

IIM Recruitment: ఐఐఎంలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం పొందే అవకాశం..
Iim Jobs

Updated on: Dec 02, 2022 | 12:13 PM

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. జమ్మూ క్యాంపస్‌లో ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అడ్మిన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, వెబ్‌ డిజైనర్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ పీజీడీసీఏ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 2,09,200 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 31-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us