NIIH Recruitment: నెలకు రూ.51000 జీతంతో.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీలో సైంటిస్ట్‌ ఉద్యోగాలు..

|

Apr 20, 2022 | 12:31 PM

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ముంబాయిలోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీ (NIIH).. సైంటిస్ట్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌ (Research Assistant Posts) పోస్టుల భర్తీకి..

NIIH Recruitment: నెలకు రూ.51000 జీతంతో.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీలో సైంటిస్ట్‌ ఉద్యోగాలు..
Icmr Niih
Follow us on

ICMR-NIIH Research Assistant Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ముంబాయిలోని ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీ (NIIH).. సైంటిస్ట్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌ (Research Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 6

పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.31,000ల నుంచి రూ.51,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:

  • సైంటిస్ట్‌ పోస్టులకు ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో ఎండీ పూర్తి చేసి ఉండాలి.
  • రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TS Inter Exams 2022: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్‌! పరీక్ష పీజు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..