ICF Recruitment: చెన్నై ఐసీఎఫ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. మార్కుల మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

ICF Recruitment: చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ(ICF) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ ట్రేడుల్లో ఉన్న అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు.  మొత్తం 600 ఖాళీలు ఉన్నాయి...

ICF Recruitment: చెన్నై ఐసీఎఫ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. మార్కుల మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

Updated on: Jul 15, 2022 | 11:32 AM

ICF Recruitment: చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ(ICF) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ ట్రేడుల్లో ఉన్న అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు.  మొత్తం 600 ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా పదో తరగతి పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషనలో భాగంగా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో కార్పెంటర్లు (50), ఎలక్ట్రీషియన్లు (156), ఫిట్టర్లు (143), మెషినిస్టులు (29), పెయింటర్లు (50), వెల్డర్లు (170), పాసా (02) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 26-07-2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఎలాంటి రత పరీక్ష లేకుండా పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* 27-06-2022న మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, 26-07-2022తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us