
ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్లకు భారీ జీతంతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ICAI సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జూలై 31, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ICAIలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 2026 జూన్ 30 నాటికి 25 సంవత్సరాలు మించరాదు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం అందించనున్నారు. వార్షిక వేతనం దాదాపు రూ.15.68 లక్షలుగా నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది. పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి నియామక అవకాశాలు కల్పిస్తారు. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే జూలై 18, 2026 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షను ఆగస్టు 16, 2026న నిర్వహించనున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ అర్హత కలిగిన యువతకు కేంద్ర స్థాయి సంస్థలో మంచి వేతనంతో ఉద్యోగం పొందేందుకు ఇది మంచి అవకాశం.
ICAIలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ICAIలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.