Indian Army Group C Jobs: నెల జీతం రూ. 63,000.. పదో తరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు

|

Jan 27, 2022 | 6:24 PM

ఇండియన్ ఆర్మీ (Indian Army).. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్ (MIRC) కింద వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

Indian Army Group C Jobs: నెల జీతం రూ. 63,000.. పదో తరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు
Indian Army
Follow us on

HQ MIRC Recruitment 2022: ఇండియన్ ఆర్మీ (Indian Army).. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్ (MIRC) కింద వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

మొత్తం పోస్టుల సంఖ్య: 45

ఖాళీల వివరాలు:
కుక్: 11
వాషర్‌మన్: 3
సఫాయివాలా (MTS): 13
బార్బర్: 7
LDC (HQ): 7
LDC (MIR): 4

పే స్కేల్:
కుక్, LDC పోస్టులకు: రూ. 19,900 – 63,200 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర పోస్టులకు: రూ. 18,000 – 56,900 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:
1. కుక్ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు భారతీయ వంటల పరిజ్ఞానంతో పాటు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

2. వాషర్‌మన్ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

3. సఫాయివాలా (MTS) పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

4. బార్బర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

5. LDC పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఇంగ్లీషులో నిముషానికి 35 పదాలు, హిందీలో నిముషానికి 30 పదాల టైప్ చేయగలగాలి. గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి:
జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసుండాలి.
ఓబీసీ అభ్యర్ధులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసుండాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసుండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి9 నుంచి 11, 2022 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు indianarmy.nic.in నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన అప్లికేషన్‌ను Adm Branch (Civil Section), HQs, MIRC, Darewadi, Solapur Road, Ahmadnagar, Maharashtra- 414110 అడ్రస్‌కు పోస్ట్ ద్వారా పంపించాలి.

దరఖాస్తు రుసుము: ఎటువంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 12, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AP Backlog Jobs: నెలకు రూ.92,000ల జీతంతో.. ఆంధ్రప్రదేశ్‌‌లో పలు టీచింగ్ బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలివే!